ETV Bharat / state

CHEATING : బ్యాంకు ఉద్యోగినంటూ మోసం... రూ.లక్షతో ఉడాయించిన దుండగుడు - crime news in guntur district

బ్యాంకు ఉద్యోగినంటూ గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ వద్ద రూ.లక్ష తీసుకుని ఉడాయించాడు. ఖాతాలో నగదు జమ చేస్తానని నమ్మించి, మోసగించాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితురాలు... పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

బ్యాంకు ఉద్యోగినంటూ మోసం
బ్యాంకు ఉద్యోగినంటూ మోసం
author img

By

Published : Aug 18, 2021, 11:49 PM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన అనిత... తన తల్లి దీనమ్మకు డ్వాక్రా సంఘం ద్వారా రూ.లక్ష మంజూరయ్యాయి. ఆ డబ్బులను తన కుమారుడు ప్రేమరాజు ఖాతాలో జమ చేయాల్సిందిగా కూతురు అనితను కోరింది. దీంతో అనిత మంగళవారం మధ్యాహ్నం కొత్తపేటలోని ఎస్బీఐకు వెళ్లింది. బ్యాంకులో ఒకేసారి రూ.లక్ష జమచేయడం సాధ్యం కాదని, రోజుకు రూ.49వేలు మాత్రమే జమ చేస్తామని సిబ్బంది చెప్పారు. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి... తాను బ్యాంకు సిబ్బందినని, ఖాతాలో మొత్తం నగదును ఒకేసారి జమ చేయిస్తానని నమ్మించాడు. రెండు వోచర్లలో రూ.70వేలు, రూ.30వేలు చొప్పున రాసి... బ్యాంకులో డబ్బులు వేస్తున్నట్లు నటించి, ఖాతాలో డబ్బు జమ అయినట్లు వోచర్లను అనితకు ఇచ్చాడు.

అనంతరం అనిత తన తమ్ముడికి ఫోన్ చేసి డబ్బులు వేసినట్లు చెప్పింది. దీంతో ఖాతాను పరిశీలించిన ప్రేమరాజు... డబ్బులు జమ కాలేదని అనితకు వివరించాడు. ఈ ఘటనతో నకిలీ వోచర్లతో అనిత బ్యాంకు సిబ్బందిని సంప్రదించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని పరిశీలించారు. అతనికి, బ్యాంకుకు ఎటువంటి సంబంధం లేదని.. అతను తమ సిబ్బంది కాదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో భయాందోళనకు గురైన అనిత... బ్యాంకు సిబ్బందికి సూచన మేరకు వన్​టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీచదవండి.

రీ యూజబుల్ రాఖీల తయారీ.. వ్యాపారంలో రాణిస్తున్న ప్రియాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.