ఉద్యోగం ఇప్పిస్తానని నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న శివపార్వతి తమను మోసం చేసిందని పలువురు మహిళలు స్థానిక రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు ఆదివారం వచ్చారు. బాధిత మహిళలు మాట్లాడుతూ... కొన్ని నెలల కిందట తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పగా... తెలిసిన మహిళే కదా అని నమ్మి శివపార్వతికి డబ్బులిచ్చామని బాధితులు చెప్పారు. డబ్బులిచ్చిన కొన్ని నెలల వరకు సమాధానం చెప్పుకుంటూ వచ్చిన శివపార్వతి... ఆ తరువాత తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు.
ఆ సమయంలో గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు. రెండు నెలల క్రితం స్థానిక రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని వివరించారు. బాధితులు కురాగంటి లూర్ధమ్మ రెండు విడతలుగా రూ.6 లక్షలు, వల్లపు వెంకటరత్నం 1లక్షా 30వేలు, దంగవరపు ఆనందమ్మ 1లక్షా 50వేలు... మొత్తం రూ.9 లక్షల వరకూ శివపార్వతికి చెల్లించామని తెలిపారు. ఇప్పటివరకూ తమకు న్యాయం జరగలేదని, శివపార్వతి తప్పించుకు తిరుగుతోందని బాధిత మహిళలు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండీ... Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు