ETV Bharat / state

వైకాపా ఎంపీలు ఏం సాధించారు.. బడ్జెట్​పై చంద్రబాబు - కేంద్ర బడ్జెట్ 2023 2024

CBN On Budget: కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌.. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామం అన్నారు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ అని.. ఈ బడ్జెట్​లో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని నిలదీశారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పూర్తిగా చేతులు ఎత్తేశారని దుయ్యబట్టారు.

CBN
చంద్రబాబు
author img

By

Published : Feb 1, 2023, 7:31 PM IST

CBN On Budget: ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామని తెలుగేదశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా కేంద్ర బడ్జెట్ ప్రణాళికలున్నాయని తెలిపారు. పోలవరం సహా రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. వైకాపాకు 31 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయిందని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని తెలిపారు. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు 5వ స్థానంలోకి రావడం గొప్ప విషయమన్నారు.

అలాగే 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు 20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం కోసం 79 వేల కోట్లు, ఆక్వారంగానికి 6 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రవాణా రంగంలో 100 ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను శ్లాబ్​లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారని తెలిపారు.

కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. కర్నాటకలో కరువు ప్రాంతాల కోసం కేంద్ర బడ్జెట్లో 5300 కోట్లు కేటాయించారని.. అయితే విభజన చట్టం ప్రకారం ఏపీలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు.

విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ అని.. ఈ బడ్జెట్​లో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని నిలదీశారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పూర్తిగా చేతులు ఎత్తేశారని దుయ్యబట్టారు. సొంత కేసులు, స్వప్రయోజనాలకు మాత్రమే వైసీపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని రుజువైందని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.