Chandrababu and Pawan Kalyan Will Participate in Bhogi Festival : రాజధాని ప్రాంతంలో ఆదివారం భోగి మంటల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు కలిసి పాల్గొననున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి ఇరు పార్టీల అధినేతలు నిరసన తెలుపనున్నారు. అమరావతి ప్రాంతంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో చంద్రబాబు - పవన్ కల్యాణ్ నేతృత్వంలో భోగి మంటల కార్యక్రమం జరుగనుంది. ఈ సంక్రాంతి సందర్భంగా "పల్లె పిలుస్తుంది రా కదలి రా" పేరుతో టీడీపీ వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది.
Palle Pilustundi Ra Kadali Ra : భోగి సందర్భంగా రాష్ట్రానికి పట్టిన కీడు తొలగాలని కోరుతూ వివిధ సమస్యలకు సంబంధించిన ఫొటోల్ని భోగి మంటల్లో దహనం చేయాలని పిలుపునిచ్చారు. "సొంతూళ్లకు చేరుకున్న వారు సాయంత్రం గ్రామ స్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి స్థానికంగా నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై ఓ తీర్మాణం చేయాలని కోరారు. ఓటర్ వెరిఫికేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకొని ఓటు ఉన్నది లేనిది తనిఖీ చేసుకోవాలని సూచించారు. సోమవారం నాడు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్, యువగళం, రీబిల్డ్ ఏపీ తదితర అంశాల మీద ముగ్గులు వేసి వాటితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని, వాటిని పల్లె పిలుస్తోంది రా కదలి రా (#PallePilustundiRaKadaliRa) హ్యాష్ లైన్‌కు ట్యాగ్ చేయాలి" అని కోరారు.
హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయింది - సైకో పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి : చంద్రబాబు
స్వర్ణయుగం వైపు పయనిద్దాం : జగన్ రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి నుంచి సంకల్పం తీసుకోవాలని నారాచంద్రబాబు నాయడు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధ్వంస పాలన ప్రజల జీవితాల్ని చీకటిమయం చేసిందని, పండుగ సంతోషాన్ని ప్రజలకు దూరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయమని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేం చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయిచేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామని, చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీలో మార్పు మొదలైంది - జగన్ 150 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో గెలవలేరు : చంద్రబాబు
ప్రతి కుటుంబంలో సంతోషం : భోగభాగ్యాల భోగి, సకల శుభాల సంక్రాంతి, కన్నుల పండువగా కనుమ పండగలు జరుపుకుంటోన్న తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని, సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంకల్పమని లోకేశ్ పేర్కొన్నారు.
ధరలు పెంచి పండుగను దూరం చేశారు : తెలుగు ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి సంసృతీ సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని పేర్కొన్నారు. సంక్రాంతి అంటే పల్లెటూర్లు, పల్లెటూర్లు అంటే సంక్రాంతి అని అన్నారు. పండుగకు కళాకళలాడాల్సిన పల్లెటూర్లు నేడు సైకో పాలనలో వలసలతో వెలవెలబోతున్నాయన్నారు. నిత్యావసర ధరలు పెంచి పేదలకు పండుగను దూరం చేశారని ఆరోపించారు. త్వరలోనే పేదల ప్రభుత్వం రైతు రాజ్యం వస్తుందని అన్నారు. వచ్చే సంక్రాంతికి రాతియుగం అంతరించి రాష్ట్రానికి స్వర్ణ యుగం రావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.