రైతులకు రూ. 3 లక్షల వరకు రుణాన్ని ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ కామేశ్వరరావు తెలిపారు. మొత్తం 222 బ్యాంకులలో రూ. 6200 కోట్లు డిపాజిట్లు, రూ.6200 కోట్ల అడ్వాన్స్లతో మొత్తం రూపాయలు 12,400 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. 52 శాతం గ్రామీణ ప్రాంతలలోనే చైతన్య గోదావరి బ్యాంకులన్నాయన్న ఛైర్మన్.. రైతులకు రూ. 3600 కోట్లు మేరకు పంట రుణాలు అందించామని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.1660 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 210 కోట్లకు రుణాలను ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను తమ బ్యాంకుల నుంచి లబ్ధిదారులకు ఇస్తున్నామని కామేశ్వరరావు అన్నారు.
ఇదీ చదవండి: రుణం ఆశ చూపి.. లక్షలు దోచేశారు