నివర్ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం వాహన శ్రేణిని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం వద్ద మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అడ్డుకున్నారు. పంట నష్టం అధికంగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బృందం శుక్రవారం చేబ్రోలు మండలంలోని మంచాల, పొన్నూరు మండలంలోని వెల్లలూరు, మునిపల్లి గ్రామాలను పరిశీలించాలని మొదట నిర్ణయించారు. వెల్లలూరు వద్ద రైతుల తరఫున అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ అక్కడికి చేరుకున్నారు. కానీ అధికారులు అక్కడ ఆగకుండా మునిపల్లి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన రోడ్డుపై నిలబడి వారి వాహన శ్రేణిని అడ్డుకున్నారు. అధికారులు వాహనాలు దిగిరావటంతో వారికి పాడైపోయిన పంట పొలాలను దగ్గరుండి నరేంద్ర చూపించారు. నష్టం వివరాలను సైతం వారికి తెలియజేశారు.
ఇదీ చదవండి