ETV Bharat / state

'రాజధానిపై సరైన సమయంలో కేంద్రం జోక్యం' - భాజపా ఎంపీ సుజనా చౌదరి వార్తలు

రాజధాని అమరావతి విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి పునరుద్ఘాటించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. న్యాయ సలహా తీసుకోకుండా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోరని వ్యాఖ్యానించారు.

mp sujana
mp sujana
author img

By

Published : Jul 30, 2020, 7:29 PM IST

మీడియాతో భాజపా ఎంపీ సుజనా చౌదరి

రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భాజపా ఎంపీ సుజనా చౌదరి పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో కేంద్రానికి ఆ నిర్ణయం ఉందని స్పష్టం చేశారు.

పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానులను పెంచుకుంటూ పోవడం సరికాదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5, 6లకు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని గవర్నర్ వద్దకు ప్రభుత్వం తీసుకెళ్లింది. న్యాయసమీక్ష లేకుండా ఈ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోరు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు, న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవు. రాజ్యసభ ఎంపీగా చెబుతున్నా.. కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుంది- సుజనా చౌదరి, భాజపా ఎంపీ

అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వివాదంపైనా సుజనా స్పందించారు.

ఎన్నికల కమిషన్​పై ఏపీ ప్రభుత్వం అనవసరంగా సమయం వృథా చేస్తోంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఉంది ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌ విషయంలో వ్యవహరిస్తున్న తీరు. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానం ఎన్నిసార్లు వ్యతిరేకించినా మార్పు రావటం లేదు- సుజనా చౌదరి, భాజపా ఎంపీ

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు పార్టీని బలోపేతం చేసి అధికారం వైపు తీసుకెళ్తారని నమ్ముతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

'ఇప్పుడు భాజపాకు బలం లేకపోవచ్చు... ప్రజలకు చేరువవుతాం...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.