Central government Fund: మాండౌస్ తుపాను కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.28.11 కోట్లు మంజూరు చేసింది. దీని ద్వారా మొత్తం 28 వేల 112 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైన ప్రతీ రైతుకు 10 వేల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నారు. ఈ చర్య వలన తుపాను వల్ల నష్టపోయిన పొగాకు రైతులకు లబ్ది చేకూరనుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఇవీ చదవండి: