ETV Bharat / state

ఏటీఏం వ్యానులో రూ.30 లక్షలు మాయం! - గుంటూరు జిల్లా తాజా క్రైమ్ న్యూస్

గుంటూరు జిల్లా గోరంట్లలో నగదు తరలించే వాహనంలో నుంచి సుమారు రూ.30 లక్షలు మాయం కావటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్, గన్‌ మెన్​తో పాటు మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఏఎస్పీ మనోహర్ రావు ఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఏటీఏం వ్యానులో రూ.30 లక్షలు మాయం
author img

By

Published : Jun 9, 2020, 5:36 PM IST

Updated : Jun 10, 2020, 12:00 PM IST

ఏటీఏం వ్యానులో రూ.30 లక్షలు మాయం

గుంటూరు జిల్లా గోరంట్లలో సెంట్రల్ బ్యాంక్​ ఆఫ్ ఇండియాకు చెందిన సుమారు రూ.30 లక్షల నగదు అపహరణకు గురైంది. ఏటీఎం సెంటర్​ దగ్గరకు వచ్చిన వాహనంలో ఉన్న నగదు అపహరణకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్, గన్ మెన్​తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు విచారణ చేస్తున్నారు. నగదు అపహరణకు గురైన సమయంలో గన్​ మెన్ బహిర్భూమికి వెళ్లినట్లు చెబుతుండగా... అతని గన్ కూడా ఘటనా స్థలంలో లేనట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్ ఏఎస్పీ మనోహర్ రావు ఘటనాస్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ వాహనం ద్వారా వివిధ బ్యాంకు శాఖలకు నగదును సరఫరా చేస్తున్నారు. అయితే ఎంత మొత్తంలో నగదు పోయిందనేది స్పష్టత లేదు. సుమారుగా రూ.25 నుంచి రూ.38 లక్షల వరకు నగదు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​వార్​ని తలపించే ఘటన... అప్రమత్తమైన పోలీసులు

Last Updated : Jun 10, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.