ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై కేసు నమోదు - అయ్యన్నపాత్రుడు

జోగి రమేశ్‌పై కేసు నమోదు
జోగి రమేశ్‌పై కేసు నమోదు
author img

By

Published : Sep 18, 2021, 10:14 PM IST

Updated : Sep 18, 2021, 10:46 PM IST

21:58 September 18

case file on jogi ramesh

గుంటూరు జిల్లా ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబు ఇంటివద్ద ఘటనకు సంబంధించి  వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై కేసు నమోదు అయింది. తెదేపా నేత జంగాల సాంబశివరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో జోగి రమేశ్‌ సహా 30 మంది పాల్గొన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  

ఇదీ జరిగింది..

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు.. ముఖ్యమంత్రి జగన్‌, హోం మంత్రి సుచరిత తదితరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ, దానికి నిరసనగా చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు జోగి రమేష్‌ ప్రయత్నించారు. వైకాపా కార్యకర్తలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుమారు 15-20 వాహనాలతో కృష్ణా కరకట్ట పైకి వచ్చారు. చంద్రబాబు ఇంటి సమీపానికి రాగానే వాహనాలు ఆపి... కర్రలకు అమర్చిన పార్టీ జెండాలు పట్టుకుని వైకాపా కార్యకర్తలు, రమేష్‌ అనుచరులు దిగి, చంద్రబాబు ఇంటి వైపు దూసుకెళ్లారు. 

ఇదీ చదవండి: COMPLAINT: 'అయ్యన్నపై అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలి'

Last Updated : Sep 18, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.