ETV Bharat / state

ప్రభుత్వ వసతి గృహం.. ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం - రేపల్లె వసతి గృహం సంరక్షణాధికారి శివశంకర ప్రసాద్ వార్తలు

పచ్చని చెట్లు.. అహ్లాదాన్ని పంచే పూల మొక్కలు.. ఆరోగ్యాన్నిచ్చే ఔషద మొక్కలు... ఇలా అంటుంటే మనకు ఏదో స్వామీజీల పవిత్ర ఆశ్రమం కళ్ల ముందు మెదులుతుంది కదూ. కానీ ఓ ప్రభుత్వ వసతి గృహాన్ని అలాంటి వాతావరణంలోనే ఉండేలా వార్డెన్​ తీర్చిదిద్దారు. ప్రకృతి ఒడిలో విద్యార్థులకు చదువులమ్మను దరి చేరుస్తోన్న ఆ వసతి గృహ విశేషాలేంటో.. అది ఎక్కడ ఉందో మనమూ తెలుసుకుందామా..!

caretaker of the hostel Sivasankara Prasad
వసతి గృహాన్ని వనంలా తీర్చిదిద్దిన సంరక్షణాధికారి
author img

By

Published : Feb 24, 2020, 7:00 PM IST

Updated : Feb 24, 2020, 7:40 PM IST

వసతి గృహాన్ని వనంలా తీర్చిదిద్దిన సంరక్షణాధికారి

వసతి గృహాలంటే ఊరికి దూరంగా.. పాడుబడిన భవనాలే గుర్తుకొస్తాయి. అలాంటిది ఆ వసతి గృహానికి వెళ్తే.. పచ్చటి మొక్కలతో నిండిన ఉద్యానవనం స్వాగతం పలుకుతుంది. ఆవరణ చుట్టూ గోడలపై శాంతిని నెలకొల్పే బుద్ధుని బొమ్మలు మనసుకు అహ్లాదాన్ని పంచుతుంటే... యువతకు ఆదర్శనీయమైన వివేకానంద వంటి మహనీయుల చిత్రాలు ఉత్తేజాన్ని నింపుతాయి. పేద విద్యార్థుల వసతిగృహాన్ని ఉద్యానవనంలా మార్చేశారు గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని వసతి గృహం సంరక్షణాధికారి శివశంకర ప్రసాద్. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కల పెంపకంలో భాగస్వాములను చేస్తున్నారు.

పిల్లల బంగారు భవితకు బాటలు వేస్తూ..

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో చేశాం అన్నట్టు కాకుండా.. విద్యార్థులకు నైతిక విలువలు నేర్పి, జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా బాటలు వేస్తున్నారు శివశంకర్​ ప్రసాద్​. వసతి గృహం చుట్టూ వివిధ మొక్కలతో పాటుగా, కొన్ని అరుదైన మొక్కలను పెంచుతూ వాటిని సంరక్షిస్తున్నారు. ఆకు కూరలు, కూరగాయలు పండిస్తూ.. వాటితోనే భోజనం వండి వడ్డిస్తున్నారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులను పచ్చని వాతావరణంలో కూర్చోబెట్టి చదివిస్తూ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు.

అవార్డులెన్నో..

వృత్తికి న్యాయం చేస్తూ పేద పిల్లలకు బంగారు భవిత అందించేలా కృషి చేస్తోన్న వార్డెన్​ ప్రసాద్​ను ఎన్నో అవార్డులు వరించాయి. పరిసరాల పరిశుభ్రత, నూరు శాతం ఉత్తీర్ణత, మొక్కల పెంపకం వంటి అంశాల్లో ఇప్పటివరకు పదిసార్లు ఉత్తమ వసతి గృహ సంక్షేమ అధికారిగా పురస్కారాలు అందుకున్నారు. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ వసతిగృహాన్ని ఉద్యానవనంలా తీర్చిదిద్దుతున్నారు.

ఇవీ చూడండి..

ఆ ఇంట్లో... 30కి పైగా పాము పిల్లలు..!

Last Updated : Feb 24, 2020, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.