అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని.. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 17వ రోజుకు చేరుకుంది. దీక్షలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొని మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు శిబిరం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించే వరకు పోరాటం సాగుతుందని నరసరావుపేట తెదేపా ఇన్ఛార్జీ డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. శిబిరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల్ల జయమ్మ, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ల హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: