ETV Bharat / city

3 రాజధానుల నిర్ణయం.. ఆర్థిక భారమే! - discussion on 3 capitals in rajyasabha tv

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 3 రాజధానుల ప్రతిపాదనపై.. జాతీయ స్థాయిలో విముఖత వ్యక్తమవుతోంది. రాజ్యసభ టీవీ ఈ విషయంపై నిర్వహించిన చర్చలో.. 3 రాజధానుల నిర్ణయం సరికాదని నిపుణులు ముక్త కంఠంతో చెప్పారు. శాసన, కార్య నిర్వాహక వ్యవస్థలన్నీ ఒకే రాజధానిలో ఉండాలని స్పష్టం చేశారు.

discussion on 3 capitals in rajyasabha tv

author img

By

Published : Jan 26, 2020, 10:39 AM IST

Updated : Jan 26, 2020, 12:49 PM IST

రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదన.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజ్యసభ టీవీలో జరిగిన చర్చలో.. నిపుణులు 3 రాజధానులపై విస్పష్టంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇది పూర్తి రాజకీయ నిర్ణయంగా కనిపిస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం చెబుతున్నట్టు.. ఇది అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే చర్య ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక, శాసన రాజధానులు ఒకే చోట ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. పరిపాలనకూ సజావుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ద బిగ్ పిక్చర్.. పేరిట రాజ్యసభలో ఈ నెల 21న ప్రసారమైన కార్యక్రమంలో ఈ మేరకు చర్చ జరిగింది.

ఇది ఊహలకు అందని విషయం: కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది

కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది

ఇదో వ్యర్థమైన ఆలోచన అని.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానుల ఏర్పాటు పరిష్కారమే కాదని కేంద్ర కేబినెట్‌ మాజీ కార్యదర్శి బీకే చతుర్వేది అన్నారు. వేర్వేరు చోట్ల రాజధాని అన్నది ఊహలకు అందని విషయంగా చెప్పారు. రాజధాని, హై కోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా ఫర్వాలేదు కానీ.. శాసన, కార్యనిర్వాహక రాజధానులంటూ వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం సరైన ఆలోచన కాదన్నారు. "ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజధాని లఖ్‌నవూలో ఉంటే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోరాజధాని భోపాల్‌లో ఉంటే, హైకోర్టు జబల్‌పూర్‌లో ఉంది. గుజరాత్‌లో రాజధాని గాంధీనగర్‌లో ఉంటే హైకోర్టు అహ్మదాబాద్‌లో ఉంది. ఇలా రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నా ఫర్వాలేదు. శాసన రాజధాని ఒకచోట, కార్యనిర్వాహక రాజధాని మరోచోట ఏర్పాటు చేయాలనుకోవడం చెడ్డ ఆలోచన" అని స్పష్టం చేశారు. కర్నూలులో హై కోర్టు, అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థికంగా భారమైనా.. ఎగువ సభను కొనసాగిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒక చోటే ఉండాలి: ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి.త్రిపాఠి

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి.త్రిపాఠి

3 రాజధానుల నిర్ణయం వృథా.. అని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి.త్రిపాఠి తేల్చి చెప్పారు. శాసన రాజధాని నుంచి పరిపాలన వేరు చేయడం తగదన్నారు. ఇది ఆర్థికంగానూ భారమే అని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే చోట ఉండాలని అన్నారు. అధికారం ఒకే ప్రాంతంలో ఉండాలని.... ఈ దిశగా అన్ని విభాగాలూ ఒకేచోట పనిచేయాలని చెప్పారు. న్యాయ వ్యవస్థ పని తీరు వీటికి భిన్నంగా ఉంటుందని.. చెప్పారు. చాలా రాష్ట్రాల్లో చారిత్రక కారణాల వల్ల.. రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎగువ సభలు రాష్ట్రాలకు అవసరమే అన్న ఆయన.. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చేవారితోపాటు వి విధ రంగాల నిపుణులు ఇందులో ఉంటారని చెప్పారు. అయితే... ఇది రాజకీయ పునరావాసం కాకూడదని అభిప్రాయపడ్డారు.

ఇతర రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తే పరిస్థితి ఏంటి?: సుప్రీంకోర్టు న్యాయవాది జయసాయిదీపక్‌

సుప్రీంకోర్టు న్యాయవాది జయసాయిదీపక్‌

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు అవసరమా.. అని సుప్రీంకోర్టు న్యాయవాది జయసాయిదీపక్‌ ప్రశ్నించారు. ఇది రేపు 4 కావొచ్చు.. అంతకుమించి కూడా కావొచ్చని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు ఏర్పడితే పరిస్థితి ఏంటన్నారు. ఇలాంటి చర్యలు.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులను దుర్వినియోగం చేయడమే అని స్పష్టం చేశారు. శాసన మండలిని రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అసలు ఎందుకు 3 రాజధానుల ఆలోచన చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. "అధికార వికేంద్రీకరణ అనేది పంచాయతీ, పురపాలకస్థాయి నుంచి జరగాలి. స్థానిక అధికారాలు వికేంద్రీకరించాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా దృష్టి పెట్టాలి. ఎగువ సభ రాజకీయాలకతీతంగా సూచనలు చేయాలి. ఉద్దేశం పక్కదారి పట్టకూడదు" అని స్పష్టీకరించారు.

3 రాజధానులు.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం: ద ట్రిబ్యూన్‌ పత్రిక సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ కేవీ ప్రసాద్‌

ద ట్రిబ్యూన్‌ పత్రిక సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ కేవీ ప్రసాద్‌

అమరావతి అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉంటుందని ద ట్రిబ్యూన్‌ పత్రిక సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ కేవీ ప్రసాద్‌ అన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే.. రాయలసీమ జిల్లాల వారు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌.. అమరావతి అంశాన్ని ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఇప్పటిదాకా విస్మరించిన మాటా నిజమే అన్నారు. కానీ.. 3 ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటు మాత్రం సరైన ఆలోచన కాదని చెప్పారు. అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందని.. రాజధాని మార్పు ఆర్థికంగానూ భారమే అని స్పష్టం చేశారు. ఇంకోచోట పెట్టుబడి పెట్టడం ఖర్చుతో కూడిన వ్యవహారమే అని తేల్చారు. ఎగువ సభ అనేది... నిపుణులతో ఉండి నిష్పాక్షికంగా సలహాలు, సూచనలు చేసేదై ఉండాలని ఆకాంక్షించారు.

తెదేపా అధినేత చంద్రబాబు స్పందన

tdp chief chandrababu tweet
తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్

ఈ నెల 21న రాజ్యసభ టీవీలో జరిగిన ఈ చర్చపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్విటర్ లో స్పందించారు. 3 రాజధానులు అన్నది.. భయంకరమైన ఆలోచనగా చెప్పారు. దేశానికి తప్పుడు సంకేతాలు ఇచ్చేదిగా ఉందన్నారు. ఈ చర్చకు సంబంధించిన యూ ట్యూబ్ లింక్ ను.. ట్వీట్ కు జత చేశారు.

Intro:Body:

ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి 3రాజధానులు పరిష్కారం కాదు. కార్యనిర్వాహక రాజధాని ఒకచోట, శాసన రాజధాని ఒకచోట అన్నది ఊహకందని విషయం. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజధాని లఖ్‌నవూలో ఉంటే, హైకోర్టు అలహాబాద్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోరాజధాని భోపాల్‌లో ఉంటే, హైకోర్టు జబల్‌పూర్‌లో ఉంది. గుజరాత్‌లో రాజధాని గాంధీనగర్‌లో ఉంటే హైకోర్టు అహ్మదాబాద్‌లో ఉంది. ఇలా రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నా ఫర్వాలేదు. శాసన రాజధాని ఒకచోట, కార్యనిర్వాహక రాజధాని మరోచోట ఏర్పాటు చేయాలనుకోవడం చెడ్డ ఆలోచన. ఆ రెండు వ్యవస్థలూ ఒకదానితో మరొకటి విడదీయలేని సంబంధం కలిగి ఉంటాయి. అసెంబ్లీ జరిగే సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలి. బిల్లులపై మంత్రులకు వివరించాలి. విశాఖ, అమరావతి ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలనుకుంటే.. పారిశ్రామికంగా, పెట్టుబడులు ఆకర్షించడం, అభివృద్ధికి అనుకూల వ్యూహాలు రూపొందించాలి. ప్రాంతీయ స్థాయిలో అదనపు అధికారాలివ్వాలి. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కర్నూలులో హైకోర్టు, రాష్ట్రం మధ్యలో ఉండే అమరావతిలో రాజధాని ఉండాలి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎగువసభ లేదు. చిన్న రాష్ట్రాలకు ఇది ఆర్థికంగానూ భారమే. అయితే ఆంధ్రప్రదేశ్‌కు అవసరమే. ఎగువ సభను కొనసాగించాలి.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు అవసరమా.. అని సుప్రీంకోర్టు న్యాయవాది జయసాయిదీపక్‌ ప్రశ్నించారు. ఇది రేపు 4 కావొచ్చు.. అంతకుమించి కూడా కావొచ్చని ఆయన ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశాలు ఏర్పడితే పరిస్థితి ఏంటన్నారు. ఇలాంటి చర్యలు.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులను దుర్వినియోగం చేయడమే అని స్పష్టం చేశారు. శాసన మండలిని రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అసలు ఎందుకు 3 రాజధానుల ఆలోచన చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. "అధికార వికేంద్రీకరణ అనేది పంచాయతీ, పురపాలకస్థాయి నుంచి జరగాలి. స్థానిక అధికారాలు వికేంద్రీకరించాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా దృష్టి పెట్టాలి. ఎగువ సభ రాజకీయాలకతీతంగా సూచనలు చేయాలి. ఉద్దేశం పక్కదారి పట్టకూడదు" అని స్పష్టీకరించారు.

అమరావతి అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో ఉంటుందని ద ట్రిబ్యూన్‌ పత్రిక సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ కేవీ ప్రసాద్‌ అన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే.. రాయలసీమ జిల్లాల వారు వెయ్యి కిలోమీటర్లలకు పైగా ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌.. అమరావతి అంశాన్ని ప్రస్తావించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఇప్పటిదాకా విస్మరించిన మాటా నిజమే అన్నారు. కానీ.. 3 ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటు మాత్రం సరైన ఆలోచన కాదని చెప్పారు. అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందని.. రాజధాని మార్పు ఆర్థికంగానూ భారమే అని స్పష్టం చేశారు. ఇంకోచోట పెట్టుబడి పెట్టడం ఖర్చుతో కూడిన వ్యవహారమే అని తేల్చారు. ఎగువ సభ అనేది... నిపుణులతో ఉండి నిష్పాక్షికంగా సలహాలు, సూచనలు చేసేదై ఉండాలని ఆకాంక్షించారు.

3 రాజధానుల నిర్ణయం వృథా.. అని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి.త్రిపాఠి తేల్చేశారు. శాసన రాజధాని నుంచి పరిపాలన వేరు చేయడం తగదన్నారు. ఇది ఆర్థికంగానూ భారమే అని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే చోట ఉండాలని అన్నారు. అధికారం ఒకే ప్రాంతంలో ఉండాలని.... ఈ దిశగా అన్ని విభాగాలూ ఒకేచోట పనిచేయాలని చెప్పారు. న్యాయ వ్యవస్థ పని తీరు వీటికి భిన్నంగా ఉంటుందని.. చెప్పారు. చాలా రాష్ట్రాల్లో చారిత్రక కారణాల వల్ల.. రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎగువ సభలు రాష్ట్రాలకు అవసరమే అన్న ఆయన.. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చేవారితోపాటు వి విధ రంగాల నిపుణులు ఇందులో ఉంటారని చెప్పారు. అయితే... ఇది రాజకీయ పునరావాసం కాకూడదని అభిప్రాయపడ్డారు.

ఈ నెల 21న రాజ్యసభ టీవీలో జరిగిన ఈ చర్చపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్విటర్ స్పందించారు. 3 రాజధానులు అన్నది.. భయంకరమైన ఆలోచనగా చెప్పారు. దేశానికి తప్పుడు సంకేతాలు ఇచ్చేదిగా ఉందన్నారు. ఈ చర్చకు సంబంధించిన యూ ట్యూబ్ లింక్ ను.. చంద్రబాబు ట్వీట్ కు జత చేశారు.

Conclusion:
Last Updated : Jan 26, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.