Vijayawada News Today: డబ్బులు పెట్టి ఏదైనా వస్తువును కొనండి. రోజూ వారీ ఆదాయం వస్తుంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందండంటూ రూ.30 లక్షల మేర వసూలు చేసిన ఘటన కృష్ణా జిల్లాలోని వాంబే కాలనీలో చోటు చేసుకుంది. ఇదే తరహాలో విస్కీ బాటిళ్లపై పెట్టుబడి పెట్టి రోజు వారీగా భారీ ఆదాయం తీసుకోండంటూ మరో యాప్ తెరపైకి వచ్చింది.
ఏప్రిల్ మొదటి వారం వరకే ఈ అవకాశం త్వరపడండి అంటూ ఆంగ్లం, హిందీలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇది చూసిన అమాయకులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలెన్నో రాష్ట్రంలో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి.
సంక్రాంతికి బంపర్ ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో లింక్స్ - నమ్మి క్లిక్ చేశారో!'
సైబరాసురుల మోసాలెన్నో: విస్కీ బాటిల్ కొనుగోలుకు రూ.43వేలు ఒకేసారి పెట్టుబడి పెట్టండి. రోజుకు రూ.3,000 చొప్పున చెల్లిస్తామని ఇలా 48 రోజుల పాటు చెల్లిస్తామని అంటారు. ఈ పథకంలో చేరితే ఆకర్షణీయమైన రివార్డులు వస్తాయనేది ప్రకటనల సారాంశం. విస్కీ 43,000 పెట్టి కొనుగోలు చేస్తే 48 రోజుల్లో రూ.1,44,480 ఆదాయం వస్తుందంటే ఎంతటి వారికైనా ఆశ పుడుతుంది.
విస్కీ 25,000 పెట్టి కొనుగోలు చేస్తే రోజుకు రూ.1,625 చొప్పున 46 రోజులు చెల్లిస్తామని, విస్కీ 13,000 పెట్టి కొనుగోలు చేస్తే రోజుకు రూ.780 చొప్పున 44 రోజులూ ఆదాయం ఇస్తామంటున్నారు. పెట్టే పెట్టుబడులకు కనీవినీ ఎరుగని రీతిలో 2, 3, 5 రెట్లు ఆదాయం వస్తుందని నమ్మించేస్తారు. ఇలా పెట్టుబడులు పెట్టించుకున్న తర్వాత యాప్‌ను మూసేస్తారు.
పెట్టుబడుల పేరుతో నయా దోపిడీ: వ్యాపారంలో పెట్టుబడులు పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే ఇప్పుడు వారి పంథాను మార్చారు. పెట్టుబడులు పేరుతో ఆకర్షించి చిన్న చిన్న పెట్టుబడులకు ఆదాయం పేరుతో డబ్బులు చెల్లించి ఆకర్షిస్తారు. తర్వాత ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టమని ప్రచారం చేస్తారు. లోరియల్ యాప్‌లో ఒకేసారి రూ.50 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.35 వేలు చొప్పున 12 రోజులు చెల్లిస్తామనే సరికి రూ.లక్షల్లో జనం చెల్లించేశారు.
ఇటీవల విస్కీ రూ. 43,000 పెట్టి 48 రోజుల్లో రూ.1.44లక్షలు వస్తుందనే సరికి చాలా మందిలో ఆశపుడుతోంది. ఒకసారి చూద్దామని ఆలోచిస్తున్నారు. ఇది ఉత్తరాది ముఠాల పని కావొచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో డబ్బులు బహుమతిగా ఇచ్చి పెద్ద మొత్తంలో గుంజేస్తారని, వారి వలలో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే రోజు వారీ డబ్బులు చెల్లించి మీ పెట్టుబడులకు 3 లేదా 4 రెట్లు చెల్లిస్తామంటే అసలు నమ్మొద్దని వీరు చెబుతున్నారు.
మహా విజ్ఞానం.. అద్భుత పరిజ్ఞానం.. 2022లో కొంగొత్త ఆవిష్కరణలు ఇవే!
'ఉద్యోగం సంగతి తర్వాత - ముందు ట్రేడింగ్ చెయ్' - మాయగాళ్ల ఉచ్చులో ఆ 2 గ్రామాలు