Swarna Dhwajarohanam program at Srikalahasti: భక్తుల పాలిట భూకైలాసంగా విరాజిల్లే శ్రీకాళహస్తీశ్వరలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణ ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, భక్త కన్నప్ప, శ్రీ చండీకేశ్వర స్వామి సమక్షంలో వేద పండితులు పూజలు చేశారు. స్వామివార్లు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. వెండి అంబారులపై కొలువదీరిన ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భజనలు, కోలాటాలతో దేవతామూర్తుల ఉత్సవం వైభవంగా కొనసాగింది.
60 అడుగుల ఎత్తు - 100 అడుగుల వెడల్పు ఆదియోగి విగ్రహం - ఎక్కడంటే ?