గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన కుంచాల రామకోటయ్య, కుంచాల నాగేశ్వరరావు సోదరులు. కొన్నేళ్లుగా వీరిరువురి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వీరి కుమారులు మధ్య గొడవ తలెత్తింది.
మారణాయిధాలతో దాడి చేయడంతో... నాగేశ్వరరావు కుమారులు వెంకట్రావు, రాము మృతి చెందారు. పాతకక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వివాదం ఎందుకు చెలరేగింది అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: