ETV Bharat / state

'పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాటలదాడి చేయిస్తారా?' - కాపు రిజర్వేషన్లు

అవినీతిని ప్రశ్నించిన వారి నిజాయతీ, వ్యక్తిత్వం దెబ్బతిసేలా ఏదో ఒక నెపాన్ని అంటగట్డడం వైకాపాకు తొలి నుంచి అలవాటేనని బీజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై పవన్​ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ తన అనుచరులతో మాటలదాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.

'పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాటలదాడి చేయిస్తారా?'

author img

By

Published : Jun 29, 2020, 4:34 PM IST

కాపు రిజర్వేషన్ల విషయంలో పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. ముఖ్యమంత్రి జగన్ తన మంది, మార్బలంతో మాటల దాడి చేయిస్తున్నారని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు విమర్శించారు. ప్రభుత్వ లోపాలను, అవినీతిని ప్రశ్నించిన వారి నిజాయతీ, వ్యక్తిత్వం దెబ్బతిసేలా ఏదో ఒక నెపాన్ని అంటగట్డడం వైకాపాకు తొలి నుంచి అలవాటేనని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుటి నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తూ.. కొంతమేర అనుకున్నది సాధించారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన వారికి కులం, మతం, ఆపాదించటాన్ని ఆయన తప్పుబట్టారు. అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు... ఆర్థికంగా చేయూతనిచ్చేలా కేంద్రం పథకాలు ప్రవేశపెట్టినా... ఏపీలో అమలు చేయడంలేదని ఆరోపించారు. భాజపా - జనసేన కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతాయని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.