గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్న రెడ్డిబోయిన యేసుదాసుగా గుర్తించారు. వినుకొండలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి నూజెండ్లకి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...పాల డైరీ ట్యాంకర్ ఢీ కొట్టింది. యేసుదాసును 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి