ప్రస్తుతం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించుటమేకాక.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థ నుంచి వైరస్ వ్యాప్తి నిరోధానికి నియంత్రణ పనులతో పాటు ప్రజల సహకారం కూడా ఉంటేనే వైరస్ వ్యాప్తి అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. నగరంలోని కంటెయిన్మెంట్ ప్రాంతాలు, రెడ్ జోన్లలో అవిశ్రాంతంగా పని చేస్తున్న పారిశుద్ధ్యంలో అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది, అధికారులకు రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయూష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన మూలికా కషాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలోని అన్ని వార్డుల్లో పని చేస్తున్న కార్మికులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో కూడా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...