ETV Bharat / state

'నాటు సారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు' - awareness meeting in repalle

నాటుసారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని తెనాలి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హెచ్చరించారు. మద్యం అమ్మకాలు, ఎన్నికల్లో పాటించాల్సిన కార్యాచరణపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

awareness-seminar-for-liquor-managers-in-rappalle
రేపల్లెలో మద్యంషాపు నిర్వాహకులకు అవగాహన సదస్సు
author img

By

Published : Mar 13, 2020, 12:21 PM IST

రేపల్లెలో మద్యంషాపు నిర్వాహకులకు అవగాహన సదస్సు

నాటు సారా తయారీ, అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారావు హెచ్చరించారు. రేపల్లె పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గంలోని మద్యం షాపుల్లో ఉన్న సేల్స్​మెన్​, సూపర్​వైజర్లతో ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించారు. మద్యం అమ్మకాలు, ఎన్నికల్లో పాటించాల్సిన కార్యాచరణపై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరూ మద్యం నిర్మూలన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఇటీవల నిబంధనలను ఉల్లంఘించి మద్యం అమ్ముతున్న ఇద్దరు సేల్స్​మెన్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.

ఇదీచదవండి.

కరోనా ఎఫెక్ట్: ఇటలీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.