గుంటూరు జిల్లా మంగళగిరిలోని రహదారి పనుల నిర్మాణ సమయంలో లభ్యమైన ఆంజనేయస్వామి విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. విగ్రహాలను పానకాల స్వామి మెట్ల మార్గంలో భద్రపరిచారు. 16వ శాతాబ్దానికి చెందిన ఈ విగ్రహాలకు.. పై భాగంలో గొడుగు ఉందని చెప్పారు.
అపట్లో స్వామివారికి వార్షికోత్సవాలు నిర్వహించారని... అందుకు ఆధారమే ఈ గొడుగులు అని చెప్పారు. ఈ పురాతన విగ్రహాలను కాపాడేందుకు ఆలయ అధికారులకు పురావస్తు శాఖ అధికారులు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి: