ETV Bharat / state

పంట కాల్వలోకి మురుగు నీరు- అధికారుల నిర్లక్ష్యంతో రైతుల అవస్థలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 11:49 AM IST

Apartments Waste Water in Crop Fields: నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పొలాలకు నీరు రాకుండా ఉన్న అడ్డంకులు తొలగించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకోవటం లేదు. సాక్షాత్తు సీఎం నివాసానికి కొద్ది దూరంలోనే రైతులు తమ పొలాలకు నీరు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Apartments_Waste_Water_in_Crop_Fields
Apartments_Waste_Water_in_Crop_Fields

Apartments Waste Water in Crop Fields: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పొలాలకు నీరు రాకుండా ఉన్న అడ్డంకులు తొలగించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నివాసానికి కొద్ది దూరంలోనే రైతులు తమ పొలాలకు నీరు అందక దిక్కుతోచని స్థితిలో అవస్థలు పడుతున్నారు.

Farmers Facing Problems in AP: తాడేపల్లి జాతీయ రహదారి వెంట వందల కొద్ది బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న పొలాల్లో అపార్ట్​మెంట్లు వెలిశాయి. అయితే నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించకపోవడం.. రైతులకు తలనొప్పిగా మారింది. అపార్ట్​మెంట్లలో మురుగు నీరు పారేందుకు నగరపాలక సంస్థ ఎలాంటి మార్గం చూపకపోవడంతో.. ఆ నీటిని పక్కనే ఉన్న పంట కాలువలోకి వదులుతున్నారు.

కౌలు రైతులకు భరోసా హామీని విస్మరించిన జగన్‌ - హామీల్లో 99% అమలు చేయడమంటే ఇదేనా?

Farmers Worry About Crop Loss: తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెండలలో పంటలను కాపాడటం కోసం 50 ఏళ్ల క్రితం బకింగ్ హామ్ కెనాల్​పై 'ఆంధ్రరత్న ఎత్తి పోతల' పథకం ఏర్పాటు చేశారు. 3వేల 500లకు పైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు అక్కడి నుంచి కాలువ తవ్వారు. ఈ మూడు గ్రామాల్లో పంటలు పండించేందుకు ఈ కాలువే ఆధారం. ప్రస్తుతం ఈ కాలువలో మురుగునీరు చేరి గరళంగా మారుతోంది. ప్రత్యామ్నాయం చూపించాల్సిన అధికారులే అపార్ట్​మెంట్ల పక్కనే మోటార్లు ఏర్పాటు చేసి మరీ మురుగునీటిని పంట కాలువలోకి వదులుతున్నారు.

రైతుల ఖాతాల్లో జమకాని రైతుభరోసా నిధులు- నగదు కోసం ఆర్బీకేలు, బ్యాంకుల చుట్టూ అన్నదాతలు

AP Farmers Facing Problems: ఫలితంగా పంటల దిగుబడి తగ్గిపోవడంతో పాటు చర్మవ్యాధులు కూడా వస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) నివాసం ఉంటున్న ప్రాంతంలోనే తమను పట్టించుకునే నాథుడే లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువలో మురుగునీరు చేరి దారుణంగా మారుతోంది. ప్రత్యామ్నాయం చూపించాల్సిన అధికారులే అపార్ట్​మెంట్ల పక్కనే మోటార్లు ఏర్పాటు చేసి మరీ మురుగునీటిని పంట కాలువలోకి వదులుతున్నారు.

Farmers Protest in AP: ఈ నెల 15న తాడేపల్లికి వచ్చిన కలెక్టర్ వేణుగోపాలరెడ్డి(Collector Venugopala Reddy)ని కలసిన రైతులు.. తమ గోడు చెప్పుకున్నారు. వెంటనే జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడారు. రైతుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులతో కమిటీని వేశారు. 15రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం జరగకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.

ప్రభుత్వం ఆదుకోకుంటే వ్యవసాయం మానేయాల్సిందే - బతకడం కూడా కష్టమే : ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.