ETV Bharat / state

AP Skill Development Center is the first in the country దేశంలోనే తొలిస్థానంలో ఏపీ స్కిల్ డెవలెప్​మెంట్ సెంటర్..! చంద్రబాబు హయమే ది బెస్ట్..

AP Skill Development Center is the first in the country ఏ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారో.. అదే సంస్థకు సంబంధించిన అంశంలో ఆయన్ను అరెస్టు చేయడం యువతను విస్మయానికి గురి చేస్తోంది. నైపుణ్య శిక్షణ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఎలా నిలుస్తుంది.. వేల మందికి ఉద్యోగాలు ఎలా లభించాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 8:21 AM IST

Skill Development Centers in TDP Government Regime

Skill Development Centers in TDP Government Regime: రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలు అందించి, ప్రపంచ స్థాయి ఉద్యోగార్హతలు కల్పించాలనే లక్ష్యంతో 2014లో నైపుణ్యాభివృద్ధి సంస్థను చంద్రబాబు తీసుకొచ్చారు. తర్వాత రెండేళ్లకే ఉద్యోగార్హత నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా అందించే రాష్ట్రాల జాబితాలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్‌ సహకారంతో గేమింగ్‌ శిక్షణ, గుగూల్‌ కోడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ లాంటి శిక్షణలతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించారు. సాధారణ డిగ్రీ వారికి సైతం ప్రత్యేక నైపుణ్యాలు అందించి.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో కలిసి ఉద్యోగ మేళాలు నిర్వహించి, ఎందరికో ఉద్యోగాలు కల్పించారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ (Skill Development Corporation) ఏర్పాటు చేసిన తర్వాత 2016 నుంచి 2019 వరకు ఏటా AP దేశంలో ప్రప్రథమంగా నిలిచింది. యువతకు నైపుణ్యాలు ఇవ్వకపోతే ఈ స్థానం ఎలా దక్కుతుంది. 2015 నుంచి 2019 వరకు ఇంజినీరింగ్, సాధారణ డిగ్రీ విద్యార్థులకు అనేక నైపుణ్యాలు అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలనే వివక్ష లేకుండా ఏపీలోని పిల్లలందరికీ విరివిగా నైపుణ్య శిక్షణలను సంస్థ అందించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. 2020 నుంచి 2022 వరకు ఒక్కో మెట్టు జారుకుంటూ ఏపీ ఏడో స్థానానికి వెళ్లిపోయింది.

Skill Development-Inner Ring Road Facts: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఇన్నర్ రింగ్‌రోడ్డులపై ప్రభుత్వం వింత ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో

లక్షల మందికి మాత్రమే శిక్షణ: నిధులు మళ్లించేందుకే చంద్రబాబు ఏర్పాటు చేశారంటున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా.. రాష్ట్రంలో 2016-17 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల 76 వేల మందికి శిక్షణ ఇచ్చి.. 85వేల 714 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందులో టీడీపీ ప్రభుత్వ హయాంలోని మూడేళ్లలోనే 2 లక్షల 72 వేల మందికి శిక్షణ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలో 1.04 లక్షల మందికి మాత్రమే శిక్షణ అందించారు.

చంద్రబాబుపై కేసు నేపథ్యంలో.. నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌లో (APSSDC) పొందుపరచిన వివరాలను ఉటంకిస్తూ పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపారని.. ఈ చర్యలు యువతకు లాభమా? నష్టమా? అనేది ఆలోచించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత వలస పోతున్న పరిస్థితిని వివరిస్తున్నారు.

TDP Leaders Visit skill Development Centers: కళ్లముందే 'స్కిల్' శిక్షణ కేంద్రాలు.. వైసీపీ నేతలవి నిరాధార ఆరోపణలు : టీడీపీ

ఏపీ మొదటి స్థానంలో: నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక ఉపాధి అవకాశాలున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మన కంటే పెద్ద రాష్ట్రాలనూ తోసిరాజని అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో మూడేళ్లు మొదటి స్థానం, ఒక ఏడాది రెండో స్థానంలో ఉంది. ఇది సాక్షాత్తూ ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్టు’వెల్లడించిన వాస్తవం. వీబాక్స్, సీఐఐ, ఏఐసీటీఈ వంటి ప్రముఖ సంస్థలు యువత ప్రతిభను మదింపు చేసి, ఏటా ఇచ్చే నివేదికలు చెప్పిన విషయమిది. యువతకు నైపుణ్యాలు అందించకుంటే ఈ స్థానం దక్కుతుందా అనేది ప్రశ్న. నైపుణ్య శిక్షణ గురించి గొప్పలు చెప్పే జగన్‌ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి మొదటి స్థానం రాలేదు. కానీ 2019లో టీడీపీ హయాంలో చేసిన కృషితో మొదటిస్థానం లభిస్తే దాన్నీ తమ ఘనతగానే జగన్‌ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంది..

టీడీపీ హయాంలో.. వైసీపీ హయాంలో..: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు 2018లో జాతీయ పురస్కారం లభించింది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన కింద నిరుద్యోగ యువతకు ట్రైనింగ్​తో పాటు ఉపాధి కల్పించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. 2017-18లో 17 వేల 972 మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వగా.. 10 వేల 923 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. భారత నైపుణ్యాల నివేదికల ప్రకారం..ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అందించే రాష్ట్రాల్లో 2016 లో మొదటి స్థానం రాష్ట్రానికి దక్కింది. 2017లో రెండో స్థానం, 2018, 2019లోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 2020లో నాల్గో స్థానానికి పడిపోయింది. 2021లో ఐదో స్థానం, 2022లో ఏడో స్థానం, 2023లో నాల్గో స్థానానికి పరిమితమైంది.

TDP Leaders Inspected Skill Development Center:" స్కిల్‌ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో అవినీతి జరగలేదు.. నిరూపించుకేనేందుకు మేము సిద్ధం..మీరు సిద్ధమా?"

తెలుగుదేశం హయాంలో డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో విద్యార్థులకు బహుళ నైపుణ్యాలను అందించారు. జిల్లాకు 5 చొప్పున ఎంపిక చేసి.. మొత్తం 65 కళాశాలల్లో బీఎస్సీ వారికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు. తరువాత మరో 525 కళాశాలల్లో ఆంగ్ల భాష వ్యక్తీకరణ వంటి కోర్సులను నిర్వహించారు. వీటి మూలంగా 4 వేల 176 మందికి టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించాయి. డిగ్రీ చదివే వారికి ఆన్‌లైన్‌ కోర్సులను నిర్వహించింది.

ఏ సంస్థ ఏర్పాటుతో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని కేసు పెట్టారో, ఆ నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్తే.. తొలుత కనిపించేది చిక్కటి చిరునవ్వులు చిందించే వైఎస్ జగన్‌ ఫొటోయే. అందులో 2016-17 నుంచి ఇప్పటి వరకు నమోదైనవారు, బ్యాచ్‌లు, ఉద్యోగమేళాలు, పథకాలు ఇలా మొత్తం వివరాలన్నీ కనిపిస్తాయి. ఎంతమందికి శిక్షణ ఇచ్చారు.. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనే వివరాలూ ఉన్నాయి.

Siemens Industry Software India MD Matthew Thomas: 'స్వయంగా సీమెన్స్‌ ఎండీ వివరించినా.. వైసీపీ నేతలకు కనిపించవు.. అవినీతి నిందలకు మాత్రం పోటీ'

తెలుగుదేశం ప్రభుత్వంలో శిక్షణ ఎలా ఉందో.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలా పడిపోయిందో గణాంకాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో 2016-17లో 17,629మంది శిక్షణ తీసుకుంటే వీరిలో 5 వేల 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 2017-18లో 44 వేల 204 మంది శిక్షణ పొందితే7వేల 35 మంది మంచి కొలువులు సాధించారు. 2018-19లో ఏకంగా 2 లక్షల10వేల 365 మంది శిక్షణ పొందితే 52 వేల 309 మందికి ఉద్యోగాలు దక్కాయి. టీడీపీ హయాంలో మూడేళ్లలో మొత్తం 2 లక్షల 72 వేల 198 మంది శిక్షణ తీసుకుంటే 64 వేల 444 మందికి కొలువులు దక్కాయి.

వైసీపీ ప్రభుత్వంలో2019-20 లో 36 వేల 227 మంది శిక్షణ పొందితే 15 వేల 372 మంది కొలువులు సాధించారు. 2020-21లో 28 వేల 698 మంది ట్రైనింగ్‌ తీసుకుంటే.. కేవలం 3వేల 168 మందికి ఉద్యోగాలు దక్కాయి. 2021-22లో 8వేల126 మంది శిక్షణ పొందితే 341 మందికి ఉద్యోగాలు దక్కాయి. 2022-23లో 9వేల90 మంది శిక్షణ పొందగా.. 2 వేల 268 మంది కొలువులు సాధించారు. 2023-24లో 1,132 మంది ట్రైనింగ్‌ తీసుకోగా.. కేవలం 121 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో మొత్తం 83 వేల 273 మంది శిక్షణ పొందితే దక్కిన ఉద్యోగాలు కేవలం21 వేల270 మంది మాత్రమే.

Siemens Former MD Suman Bose Response on Skill Development Case: స్కిల్‌ డెవలప్​మెంట్​ కేసులో వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం: సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌

AP Skill Development Center is the first in the country దేశంలోనే తొలిస్థానంలో ఏపీ స్కిల్ డెవలెప్​మెంట్ సెంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.