AP POLYCET 2023 Results Released: ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిసెట్ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి విజయవాడలో విడుదల చేశారు. ఈసారి నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షలో 1లక్ష 24వేల 021 మంది పాస్ అయ్యారు. మొత్తంగా 86.35 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 88.90శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.74శాతం సాధించారు. అయితే ఇందులో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 15మంది విద్యార్థులు 120కు 120 మార్కులు సాధించారు.
"ఈరోజు ఏపీ పాలిసెట్ 2023 ఫలితాలు విడుదల అయ్యాయి. మే 10న జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు 1లక్షా 60వేల 329 మంది అప్లై చేసుకున్నారు. వారిలో 1లక్ష 43వేల 592 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1లక్ష 24వేల 021మంది పాస్ అయ్యారు. 86.35శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 88.90శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.74శాతం సాధించారు. మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహించాం. అందులో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లు. అందులో 15 మంది 120కి 120 మార్కులు సాధించారు. విశాఖ మొదటి స్థానంలో ఉంది"-చదలవాడ నాగరాణి , సాంకేతిక విద్యాశాఖ కమిషనర్
ఈ నెల 10వ తేదీన ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 267 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 77వేల 117 సీట్లను భర్తీ చేయనున్నారు. దాదాపు 31 కోర్సుల్లో 2 సంవత్సరాలు, 3సంవత్సరాలు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 29 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జులై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ప్రకటించారు. మొత్తం 77వేల 117సీట్లకు 1లక్ష 60వేల 329 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1లక్ష 43వేల 592 మంది హాజరయ్యారు. అందులో 1లక్ష 24వేల 021 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా బేతంచెర్ల, కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు పాలిసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
- అధికారిక వెబ్సైట్ https://polycetap.nic.in కు లాగిన్ అవ్వాలి.
- అక్కడ హోమ్ పేజ్‌లో కనిపిస్తున్న పాలిసెట్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
- స్క్రీన్‌పై మీ ర్యాంక్ కార్డ్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకోండి.
ఇవీ చదవండి: