గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో పర్యాటక కేంద్రంగా ఉన్న కొండవీడు ప్రాంత సందర్శనను మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ అధికంగా ఉన్న క్రమంలో పర్యాటకుల సందర్శన ప్రాంతాలన్నింటినీ మూసివేయాలంటూ కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో జిల్లాలో అత్యధిక పర్యాటకులు సందర్శించే కొండవీడు నగరవనం సందర్శన కూడా పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. కొండవీడు సందర్శనానికి సంబంధించి తిరిగి ప్రకటన వెలువడే వరకు ఈ ప్రాంతానికి రాకుండా అటవీశాఖ అధికారులతో.. పర్యాటకులు సహకరించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం కొండవీడు బీట్ అధికారి షేక్ అమీర్‌జానీబాష ఆధ్వర్యంలో ఘాట్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద గేట్లు మూసేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: కరోనా మృతుల అంత్యక్రియలకు, ప్లాస్మా దాతలకు ప్రభుత్వ సాయం