గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో గురువారం 90 మంది రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెలలో ఇంత మంది ఒకేసారి డిశ్చార్జ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో కేసులు పెరుగుతున్న క్రమంలో తాడేపల్లి మండలం గుండిమెడలోని ఓ ప్రైవేటు కళాశాల వసతి గృహంలో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
మొత్తం 400 పడకలను అందుబాటులో ఉంచారు. ఈ సెంటర్లో నిత్యం ఇద్దరు డాక్టర్లు, 8 మంది నర్సులు విధులు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తామని ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం, రోజుకు మూడు వాటర్ బాటిల్స్ అందించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: రైలు ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్!