గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన రైతు యారగోపు రామచంద్రరావు ఆదివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
రాజధాని నిర్మాణానికి 2 ఎకరాల 50 సెంట్ల భూమిని రామచంద్రరావు ఇచ్చినట్టు కుటుంబీకులు చెప్పారు. 3 రాజధానుల ప్రకటన వచ్చిన దగ్గరనుంచి నిత్యం ఐనవోలులో ఉద్యమంలో పాల్గొన్నారని రైతులు తెలిపారు. అమరావతి తరలిపోతుందేమోనని రోజు బాధ పడేవారని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: