గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారికి కల్యాణ మహోత్సవంలో పంచామృతాభిషేకలు జరిపారు. స్వామి వారి మూల విరాట్ ఎదుట బియ్యం కొలిచి అనకట్ట కట్టారు. 4 గంటల తర్వాత ఆ బియ్యాన్ని కొలిచారు. కళాకారులు గణపతి, శివుడు, నరసింహ స్వామి, సాయిబాబా, కాళీమాతా వేషధారణలతో చేసిన నృత్యాలు అలరించాయి.
మహిళలు కుడుములలో జ్యోతులు వెలిగించుకుని పళ్లెర వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు నోటిలో నారసాల గుచ్చికుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు.