గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. స్థానిక మార్కెట్ సెంటర్లో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను... నూతన ప్రభుత్వం ఏలాంటి ఆదేశాలు జారీ చేయకుండానే రాజన్న క్యాంటీన్‌గా పేరు మార్చేశారు. క్యాంటీన్‌కు వైకాపా జెండా రంగులను అద్దారు. ఎన్టీఆర్ చిత్ర పటాల స్థానంలో ముఖ్యమంత్రి జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆదేశాలు లేకుండానే వైకాపా శ్రేణులు ప్రదర్శించిన తీరు పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-విద్యార్థులను కూలీలు చేసిన విద్యాశాఖ!