ETV Bharat / state

FDI: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం వెనుకంజ.. దక్షిణాదిలోనే అట్టడుగు స్థానం

Foreign Direct Investment: సువిశాల సముద్ర తీరం ఉంది. రవాణా అనుసంధానం బాగుంది. నౌకాశ్రయాలు.. విమానాశ్రయాలు.. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం.. రాష్ట్రం గురించి ఇలా గొప్పగా చెప్పుకొనే ఈ అనుకూలతలేవీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ప్రభావం చూపలేకపోయాయి. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దక్షిణాదిలోనే మన రాష్ట్రం అట్టడుగుస్థానంలో ఉంది. భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు ఉన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాబట్టంలో మాత్రం రాష్ట్రం చతికిలపడింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 2, 2023, 7:32 AM IST

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్రం

Foreign Direct Investment In AP : సాధారణంగా పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో.. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ అనుకూల విధానాలు అంతే ముఖ్యమంటారు పారిశ్రామికవేత్తలు. పెట్టుబడిదారులను ప్రోత్సహించే వాతావరణం ఉంటేనే పరిశ్రమలు ప్రవాహంలా వస్తాయి. రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు, ఇతర అనుకూలతలు బాగున్నా.. విదేశీ పారిశ్రామికవేత్తలు మాత్రం రాష్ట్రం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. విశాఖలో మార్చిలో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలు జరిగినా.. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో మాత్రం రాష్ట్రానిది దక్షిణాదిలో అట్టడుగు స్థానమే.

దక్షిణాదిలో అట్టడుగు స్థానం: ప్రతి ఏటా ఒనగూరే ఎఫ్​డీఐల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా, తద్వార అక్కడ పారిశ్రామిక ప్రగతిని అంచనా వేస్తుంటారు. 2019 వ సంవత్సరం అక్టోబరు నుంచి 2022 డిసెంబర్‌ వరకు వచ్చిన ఎఫ్​డీఐలు, రాష్ట్రాల వాటాపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డీపీఐఐటీ గతేడాది డిసెంబర్‌లో నివేదిక వెల్లడించింది. డీపీఐఐటీ నివేదిక ప్రకారం 3 లక్షల 74వేల 92 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించి మహారాష్ట్ర దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, గుజరాత్‌ ఉన్నాయి. మొదటి పది స్థానాల్లో దక్షిణాది నుంచి కర్ణాటక రెండోస్థానం, తమిళనాడు ఐదోస్థానం, తెలంగాణ ఏడోస్థానం దక్కించుకున్నాయి. ఈ వరుసలో రాష్ట్రానిది ఏకంగా 14వస్థానం. మన తర్వాత స్థానాల్లో మధ్యప్రదేశ్, బిహార్ మాత్రమే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి.

పెట్టుబడులు అర శాతం కన్నా తక్కువే : సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మనదే ఆఖరిస్థానం. గత మూడేళ్లలో ఏపీకి వచ్చిన ఎఫ్​డీఐలు 5వేల 752 కోట్లు కాగా.. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 9 నెలల కాలంలోనే 8వేల 494 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 2019 అక్టోబర్ నుంచి 2022 డిసెంబర్‌ వరకు దేశంలోకి మొత్తం 13లక్షల 42వేల 389 కోట్ల ఎఫ్​డీఐలు వచ్చాయి. అందులో ఏపీ వాటా కేవలం 5వేల 752 కోట్లు మాత్రమే. ఇది మొత్తం పెట్టుబడుల్లో 0.42 శాతం వాటానే. తీర ప్రాంత రాష్ట్రాలైన మహారాష్ట్ర 27.8శాతంతో తొలిస్థానంలోనూ , కర్ణాటక 23.9శాతంతో రెండోస్థానంలో ఉండగా.. ఏపీ కనీసం అరశాతం వాటా కూడా కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది మేలో దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన ఒప్పందాలు, మార్చిలో విశాఖలో వేదికగా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న 13 లక్షల కోట్ల ఎంవోయూలన్నీ దేశీయ సంస్థలకు సంబంధించినవే. వాటిలో కూడా అగ్రభాగం పెట్టుబడులు పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా వచ్చేవే.

రాజకీయ అంశాలతో ముడిపెడితే ఎవరు రారు : కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు ముందుగా సురక్షిత ప్రాంతాలకే తొలి ప్రాధాన్యమిస్తారు. తమ కార్యకలాపాలను దీర్ఘకాలంపాటు సాగించేలా అక్కడి ప్రభుత్వాల సహకారంపై అంచనా వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టడానికి ముందడుగు వేస్తారు. ఆయా రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు, భూ కేటాయింపులు, విద్యుత్‌ రాయితీలు, ప్రోత్సాహకాల గురించి తర్వాత ఆలోచిస్తారని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వంపై విశ్వసనీయత అవసరం. ఒక ప్రభుత్వా విధానాలను దాని తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తాయన్న నమ్మకం పెట్టుబడిదారులకు కల్పించాలి. రాజకీయ అంశాలతో ముడిపెడితే ఎవరూ ముందుకురారని అంటున్నారు.

డీపీఐఐటీ గణాంకాల ప్రకారం వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో ఎఫ్​డీఐలు రాలేదు. విశాఖ, దావోస్ సదస్సులలో కుదుర్చుకున్న ఎంవోయూల్లో అధిక భాగం అరబిందో, అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీలతోనే ఉన్నాయి. సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు రిలయన్స్‌ సంస్థ.. ఎంవోయూ ఒక్కటి మాత్రమే కొత్తది. గతంలో కుదుర్చుకున్న ప్రాజెక్టుల విస్తరణకు మరికొన్ని పెట్టుబడులు వచ్చాయి తప్ప.. రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే ప్రముఖ కంపెనీలేవీ రాలేదు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.