గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరులో పురాతన శివాలయాన్ని గుర్తించారు. గ్రామంలో పేదలకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రెండెకరాల భూమిని సేకరించారు. ఆ ప్రాంతంలో మార్గం కోసం కూలీలు శనివారం ముళ్లచెట్లు తొలగిస్తుండగా దేవాలయం వెలుగుచూసింది. అందులో రెండు శివలింగాలు, నంది, దేవత విగ్రహాలున్నాయి. సమాచారం తెలుసుకొన్న గ్రామస్థులు విగ్రహాలకు పూజలు చేశారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. ఈ ఆలయం 300 వందల ఏళ్ల నాటిది అయిఉండొచ్చని గ్రామంలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చవదవండి: పీవోకేలో చైనా విమానం- సరిహద్దులో భారీగా బలగాలు