అమరావతి రాజధాని వ్యవహారాలు న్యాయస్థానాల్లో ఉన్న సమయంలో.. ప్రాంతాల వారీగా ప్రజలను వేరు చేయాలనే కుట్రతో రాష్ట్ర మంత్రులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని తాము ఆటంకపరుస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొనడాన్ని ఖండించారు. మంత్రులు తమ పదవులను కాపాడుకునేందుకు.. ముఖ్యమంత్రి మొప్పు పొందేందుకు చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
తొలి నుంచే...
తొలి నుంచి మంత్రి బొత్స అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. శాఖపై మంత్రికి పట్టులేదని.. అలాంటి వ్యక్తి ఈ ప్రాంత రైతులతో భేటీ అయ్యేది లేదనడం సరికాదన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అమరావతి రైతులు.. తల్లిలాంటి పంట భూమలను త్యాగం చేశారన్నారు. ఈరోజు పరిపాలన జరుగుతోంది తాము ఇచ్చిన భూముల నుంచే అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మంత్రులు వ్యాఖ్యలు చేయడం భావ్యంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి