అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అలుపెరగాని పోరాటం చేస్తున్న ప్రజలు... జనతా కర్ఫ్యూలో మమేమకయ్యారు. 96 రోజులుగా సాగిన ఉద్యమానికి భిన్నంగా... ఇళ్ల వద్దే నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ తమవంతు భాగస్వాములైనట్లు రైతులు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల ముందు నిలబడి చప్పట్లు కొట్టారు. కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత కొవ్వొత్తుల వెలిగించి... అమరావతి ఆకాంక్షను వెలిబుచ్చారు.
ఇదీ చదవండి : వీడియో: ఏకతాటిపైకి ఆంధ్రా జనం... ఊరూవాడా నిశ్శబ్దం