వచ్చే వినాయకచవితి నాటికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని అమరావతి రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 249వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాల్లోనే రైతులు వినాయకచవితిని జరుపుకున్నారు.
తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పెదపరిమి, అబ్బిరాజుపాలెం, బోరుపాలెం, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలంటూ వినాయకుడిని మహిళలు ప్రార్థించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో పండుగలన్నీ రోడ్డుపైనే జరుపుకునే పరిస్థితి వచ్చిందని మహిళలు వాపోయారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని ప్రభుత్వం ప్రకటించిన రోజే తమకు అసలైన పండగ అని రైతులు, మహిళలు చెప్పారు.