ప్రజాభీష్టానికి భిన్నంగా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని కోరుతూ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బొమ్మకు అమరావతి యువజన జేఏసీ నాయకులు వినతి పత్రం సమ్పరించారు. గుంటూరు గుజ్జనగుండ్ల వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లును రాష్ట్ర గవర్నర్ పంపడం బాధాకరమని అమరావతి యువజన జేఏసీ అధ్యక్షడు రావిపాటి సాయి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచక్షణ అధికారాలు ఉపయోగించి బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు భిన్నంగా మూడు రాజధానుల పేరుతో కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....