వెలుగు పేరుతో రాత్రి వేళల్లోనూ రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు ఆందోళన కొనసాగించారు. తుళ్లూరు మండలం మందడం, రాయపూడి, అబ్బురాజుపాలెం, దొండపాడు, తుళ్లూరు గ్రామాల్లో మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. దీపాలు వెలగించి రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహిళలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చెప్పేంతవరకు ఆందోళనను విరమించబోమని రైతులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజధాని కోసమే కాదు.. మహమ్మారిపై పోరుకు సిద్ధం