435వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు - అమరావతి రైతుల ఆందోళనలు
ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలంటూ అమరావతి రైతులు డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 435వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతిలో రైతుల ఆందోళనలు 435వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతులు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జై అమరావతి అంటూ నినదిస్తున్నారు. తమతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాజధాని మార్పు అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే రాజధాని ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వెనక్కు తగ్గిందని రైతులు అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల్ని ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. అమరావతిలో ఉన్నవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పినవారు ఇప్పుడు.. ఇక్కడ రూ.3వేల కోట్లు అప్పు తెచ్చి అభివృద్ధి చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇవన్నీ రాజధాని రైతుల్ని మోసం చేయటానికేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గుంటూరులో ఘాటెక్కిస్తున్న నగరపాలక పోరు