అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులను, సీపీఐ నేతలను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో పలువురు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ను పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌కి, నగర కార్యదర్శి కోట మాల్యాద్రిని అరుండల్‌పేట పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని అరెస్టులు చేసినా, గృహానిర్బంధం చేసినా.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అరెస్ట్‌లతో తమను ఆపలేరని చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని అజయ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: అగ్రిగోల్డ్ బాధితుల చలో అసెంబ్లీ