ETV Bharat / state

అంత్యక్రియలు అయ్యాక తెలిసింది... కరోనా పాజిటివ్! - గుంటూరు జిల్లా కరోనా వార్తలు

అంత్యక్రియలు అనంతరం ఇద్దరు వ్యక్తులకు కరోనా ఉందని అధికారులు గుర్తించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలం కొర్రపాడులో జరిగింది. అంత్యక్రియల్లో పాల్గొన్న వారంతా ఆందోళనకు గురవతున్నారు.

after  funereal  process two persons tested corona postive  in guntur

author img

By

Published : Jul 23, 2020, 12:56 PM IST

గుంటూరు జిల్లా మేడికొండ్రు మండలం కొర్రపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంచి మిత్రులు. ఇద్దరు ఒక్క రోజు తేడాతో మరణించటం స్థానికుల్లో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజులుగా మెడికొండ్రు మండలం కొర్రపాడుకు చెందిన ఇద్దరు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందగా...మరో వ్యక్తి బుధవారం మృతి చెందాడు.

ఛాతీ నొప్పితో మరణించాడని కారణం చెబుతూ కుటుంబ సభ్యుల అదే రోజు అంత్యక్రియలు చేశారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య కార్యకర్తలు ఆరా తీశారు. మరణించిన వ్యక్తి కొద్దీ రోజుల క్రితం ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నాడని గుర్తించారు. ఇచ్చిన నివేదిక పత్రాల్లో మృతుడికి కరోనా పాజిటివ్ ఉందని ఆరోగ్య కార్యకర్తలు వెల్లడించారు

ఇదిలా ఉండగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మరణించాడు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనం ద్వారా మృతదేహాన్ని కొర్రపాడు తీసుకువచ్చారు. నేరుగా శ్మశాన వాటికకు తరలించారు. అంతక్రియలు చేశారు. అయితే ఇతనికి రెండు సార్లు నెగిటివ్ వచ్చింది. ఒకసారి పాజిటివ్ వచ్చింది. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడని జిల్లా వైద్యాధికారులు మెడికొండ్రు వైద్యులకు సమాచారం ఇచ్చారు.

ఇప్పుడు వారి అంత్యక్రియలకు హాజరైన వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి

మనుషుల్ని విడగొడుతోంది... మానవత్వం కొడిగడుతోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.