గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని ఓ పరిశ్రమలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాల్డా, పామోలిన్ నూనెతో కల్తీ చేసిన నెయ్యిని “గో అమృత్ ఘీ” పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పరిశ్రమలో నిల్వ ఉన్న 200 కిలోల డాల్డా, 945 కిలోల పామోలిన్ నూనెను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: