గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని పేరుకలపూడి గ్రామంలో ఆరాధ్యుల రాము, దానబోయిన నరసింహా అనే రైతుల మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని రెండు ఎకరాల్లోని పంట కాలిపోయింది. దాదాపు లక్ష రూపాయలు పంట నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు.
అదే క్రమంలో కఠెవరం గ్రామంలో బిక్కీ రామారావు అనే రైతు మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. 1.50 వేల ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు ఉచితంగా మెడికల్ కిట్లు