గుంటూరు జిల్లా తాడేపల్లి అమర్‌రెడ్డి కాలనీలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు పార్థసారథి... పోలీసుల కృషితో అమ్మ ఒడికి చేరాడు. బుధవారం సాయంత్రం తమ కుమారుడు కనిపించడం లేదంటూ బాలుడి తల్లి వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి శ్రీనివాసరావు సోదరుడు శ్యామ్యూల్, స్నేహితుడు అబ్రహాం అనే వ్యక్తులు బుధవారం మధ్యాహ్నం తమ కుమారుడ్ని తీసుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు.
ఆరుగంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి 5లక్షలు ఇస్తేనే బాలుడ్ని క్షేమంగా విడిచిపెడతామని బెదిరించారని పేర్కొన్నారు. అపహరణకు గురైన పార్థసారథిని కాపాడేందుకు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు 8 ప్రత్యేక గాలింపు బృందాలగా ఏర్పడి గాలించారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరి కొత్తపేటలో బాలుడి ఆచూకీ తెలుసుకున్నారు. పార్థసారథిని క్షేమంగా తాడేపల్లికి తీసుకొచ్చిన పోలీసులు... విచారణ చేపట్టారు. కేవలం డబ్బుల కోసమే బాలుడి తండ్రి శ్రీనివాసరావు సోదరుడు శ్యామ్యూల్, స్నేహితుడు అబ్రహాం కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి