కరోనాతో వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం యాలవర్తిపాడులో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించింది. అనుమానం వచ్చి అతనికి కోవిడ్ -19 పరీక్ష చెేయగా... పాజిటివ్ అని వచ్చింది.
ఈ నెల 21 నుంచి గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం మృతి చెందినట్లు మందపాడు వైద్యులు తెలిపారు. మండలంలో ఇప్పటివరకు కరోనాతో 10 మంది, ఫిరంగిపురం మండలంలో 8, తాడికొండ మండలంలో ఆరుగురు మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: