ఆనందయ్య మందు అని చెప్పి అక్రమంగా ఔషధాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని గుంటూరు జిల్లా తాడికొండ పోలీసులు అరెస్టు చేశారు. మోతడక గ్రామానికి చెందిన అన్నే కాంతారావు అనే వ్యక్తి.. కరోనా నివారణకు ఆనందయ్య ఔషధం తయారు చేస్తున్న మందు ఇదేనని చెప్పి స్థానికులకు విక్రయిస్తున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది.
ఆనందయ్య మందు పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇటువంటి వారిని నమ్మవద్దని.. ప్రజలకు సూచించారు. కాంతారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Brahmamgari Matam: పీఠాధిపతి మరణంపై అనుమానాలున్నాయి: శివస్వామి
16 CRORE INJECTION: చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజక్షన్‌కు రూ.16 కోట్లు కావాలి..!