తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఆలపాటి రాజా నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ ఉపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు రవీంద్రను ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్‌లో డైరెక్టర్‌గా తీసుకోవాలంటూ ఆలపాటి రాజా బెదిరించారని ఉపేంద్ర ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన టీఎన్ఎస్ఎఫ్ నేతలను పరామర్శించానంటూ పోలీసులు కేసు నమోదు చేశారని తెదేపా నాయకుడు నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. నెల్లూరు వన్ టౌన్ లో తనపై కేసు ఉందంటూ ఆ జిల్లా పోలీసులు తాడేపల్లి వచ్చి తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. 2019లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై దాడి జరిగితే...ఆస్పత్రిలో బాధితులను పరామర్శించినందుకు కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: