గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గోగమూడికి చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వసతిగృహంలో ఉంటున్న మహేష్ చెరువులో శవంగా కనిపించాడు. అతని మెడకు తాడు కట్టి ఉండటంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. అబ్బినేనిగుంటపాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మహేష్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాల యాజమాన్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గుంటూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
ఇదీ చూడండి పోలీసుల అదుపులో బాలికపై అత్యాచార నిందితుడు