- కడపలో ముఖ్యమంత్రి పర్యటన.. 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజులు పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. దీని నిమిత్తం జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులు కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఎస్పీ అన్బురాజన్ పోలీసులకు సూచించారు.
- సీఎం జగన్ పుట్టినరోజు..9 ప్యాకేజీలు ప్రకటించిన ఏపీఎస్ఎఫ్ఎల్
ఏపీ ఫైబర్ నెట్ సంస్థ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి ఇంటికి జీబీ ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న చివరి ఇంటి వరకూ ఇంటర్నెట్ సదుపాయం అందాలని.. సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
- ఆ భవనాలు పాఠశాలలకు ఇస్తాం.. హైకోర్టులో ప్రభుత్వం
పాఠశాల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితోపాటు.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీ హైకోర్టులో హాజరయ్యారు. పాఠశాలల ఆవరణల్లో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను పాఠశాల వినియోగానికి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వాధికారులు హైకోర్టుకు తెలిపారు.
- మరో పిటిషనర్‌కు భద్రత కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మసీదు భూముల వ్యవహారంలో పోరాటం చేస్తున్న.. మైనారిటీ నేత ఇబ్రహీం హత్యకు గురి కావడంతో మరో పిటిషనర్ ఫరీద్‌కు తక్షణమే రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. మసీదు ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మృతుడు ఇబ్రహీం, ఫరీద్ సెప్టెంబర్ 12న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
- కొత్త వేరియంట్ భయాలు.. మళ్లీ లాక్డౌన్ ఉంటుందా?.. ఆ ఫేక్ న్యూస్‌లతో జాగ్రత్త!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. చైనాను అతలాకుతలం చేసిన కొత్త వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. పాత రోజులను గుర్తుకు తెచ్చేలా.. అందరూ మాస్కులు పెట్టుకోవాలని కేంద్రం చెబుతోంది. మరి లాక్డౌన్ కూడా వచ్చే అవకాశం ఉందా? విమాన రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారా? ఈ ప్రశ్నలకు సంబంధిత వర్గాలు ఏం చెబుతున్నాయంటే?
- దేశంలో తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా
ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేది అడుగుజాడల్లో నడవాలనుకుంది ఆ యువతి. ఎంతో క్లిష్టమైన ఎన్డీఏ పరీక్షను రాసీ ఉత్తీర్ణురాలైన సానియా మీర్జా.. గగన విహారమే కాక యుద్ధాలు కూడా చేయగలమని చూపించేందుకు ముందుకు వచ్చింది.
- మీ సాయం విరాళం కాదు.. పెట్టుబడి: జెలెన్స్కీ
ఉక్రెయిన్ ఒంటరిది కాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. యుద్ధం ముగిసే వరకు ఆ దేశానికి అమెరికా అండదండలు కొనసాగుతాయన్నారు.
- షావోమీకు ఊరట.. రూ.3,700 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తునకు నో
ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి సంబంధించిన రూ.3,700కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల జప్తుపై ఆదాయపు శాఖ జారీ చేసిన ఆదేశాలను కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది.
- IND VS BAN: తొలి రోజు భారత్‌దే.. విజృంభించిన అశ్విన్, ఉమేశ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ ఆట పూర్తయ్యేసరికి టీమ్ఇండియాకే ఆధిపత్యం దక్కింది.
- Pathan: మరోసారి షారుక్-దీపిక కలర్ ఫుల్ హాట్ షో.. సెకండ్ సాంగ్ అదిరింది!
షారుక్ ఖాన్ దీపికా పదుకొణె నటిస్తున్న పఠాన్ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. మొదటి సాంగ్‌లో లానే రెండో పాటలో కూడా షారుక్-దీపిక హాట్ రొమాన్స్ చేస్తూ కనువిందు చేశారు. ఆ వీడియోను చూసేయండి..
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @5PM - ap top ten news
.
ఏపీ ప్రధాన వార్తలు

Last Updated : Dec 22, 2022, 5:55 PM IST