ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని 104 సిబ్బంది ఆందోళన - 104 employes protest for job security news update

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద 104 సిబ్బంది ఆందోళన చేపట్టారు. కరోనా కష్టకాలంలో కూడా వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిన తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

104 staff concerned with job security
ఉద్యోగ భద్రత కల్పించాలని 104 సిబ్బంది ఆందోళన
author img

By

Published : Nov 16, 2020, 4:18 PM IST

104 వాహనాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా వైద్యరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 2008 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 104 వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ ప్రభుత్వానికి పేరు తీసుకొస్తున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 104 ఉద్యోగులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇంత వరకు ఆ హామీ అమలు కాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ తాము సేవలందించామని, అయితే గత ఐదారు నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి, వేతనాలను పెంచాలని వారు కోరారు.

ఇవీ చూడండి:

పోలీసు ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్: సుచరిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.