ETV Bharat / state

శ్మశానాల కబ్జాలా పర్వంలో.. ఇదో తరహా ప్రత్యేకం.. ! కోట్లు విలువ చేసే భూమి స్వాహా! - Eluru district local news

Tadavai village graveyard occupied: ఆయనోక రాజకీయ నాయకుడు. గతంలో సర్పంచ్‌గా విధులు నిర్వర్తించాడు. ఎలాగైనా గ్రామంలో ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జా చేయాలని పూనుకున్నాడు. ఓ అమాయక రైతుని పావుగా వాడుకొని.. రాత్రికి రాత్రే సమాధులను తవ్వించేశాడు. స్థలమంతా నాదేనని, ఎవరైనా అడుగుపెడితే అంతేనని గ్రామస్థులను హెచ్చరించాడు. చివరికి ఆయన చేస్తున్న మోసాలను తెలుసుకున్న ఊరి ప్రజలు.. అధికారులకు వివరించినా పరిష్కారం లభించలేదంటూ ఆవేదన చెందుతున్నారు.

SMASANAM
SMASANAM
author img

By

Published : Feb 14, 2023, 3:17 PM IST

Tadavai village graveyard occupied: ఆయనో రాజకీయ నాయకుడు. గతంలో సర్పంచ్‌గానూ పని చేశారు. ఊర చెరువు, దానికి ఆనుకుని ఉన్న శ్మశాన స్థలంపై అతడి కన్ను పడింది. కబ్జా చేసేందుకు గ్రామంలోని ఓ అమాయక రైతుని పావుగా వాడుకున్నారు. రాత్రికి రాత్రే సమాధులను తవ్వించేశారు. స్థలం నాది.. అందులోకి వస్తే అంతే అని.. గ్రామస్థులను హెచ్చరించారు. విషయం తెలిసి అవాక్కైన ఊరి ప్రజలు.. అధికారులను కలిసి మోసాన్ని వివరించినా పరిష్కారం లభించలేదు.

ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన ఊరచెరువు. ఈ చెరువులో కొంత భాగంతో పాటు పక్కనే ఉన్న స్థలాన్ని దశాబ్దాలుగా గ్రామానికి చెందిన వారు శ్మశానంగా వాడుకుంటున్నారు. గ్రామంలో ఎవరు కాలం చేసినా.. ఇక్కడే ఖననం చేస్తున్నారు. కరోనా సమయంలోనూ పెద్ద ఎత్తున ఇక్కడ సామూహిక ఖననాలు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఓ సారి.. ఈ చెరువు పక్కనున్న శ్మశాన స్థలాన్ని పక్కనే ఉన్న రైతు ఆక్రమించాడు.

దీంతో గ్రామస్థులు అంతా ఏకమై.. అధికారుల చుట్టూ తిరిగి శ్మశాన స్థలాన్ని తిరిగి సాధించుకున్నారు. ఖననం చేసేందుకు వచ్చిన వారికి వీలుగా.. నాటి తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు.. ప్రస్తుత వైసీపీ హయాంలోనూ నీటి వసతి కల్పిస్తూ నీళ్ల ట్యాంకులు కూడా నిర్మించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. ఈ ఊరచెరువుతో పాటు పక్కనే ఉన్న శ్మశాన స్థలం కూడా తనదేనంటూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానని.. ఇందులో ఎలాంటి ఖననాలు చేసేందుకు వీల్లేదంటూ గ్రామస్థులను అడ్డుకున్నాడు. చెరువులో ఉన్న సమాధులను సైతం తవ్వేసి.. కట్టమీద వేశాడు.

శ్మశానాన్ని ఆక్రమించిన వ్యక్తే.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని.. జగనన్న కాలనీల్లో గ్రామానికి మరో స్థలం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ ఊరికి శ్మశానం లేదని.. రైతుల చెరువును తాత్కాలికంగా వాడుకుంటున్నామని.. తక్షణం తమ ఊరి శ్మశానికి స్థలం కేటాయించాలని అతనితో స్పందనలో ఫిర్యాదు ఇప్పించాడు. ఇప్పటి వరకు వాడుకుంటున్న శ్మశానాన్ని, చెరువును వదిలేస్తున్నట్లు స్పందన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని సంతకంతో పాటు.. ఊరికి చెందిన పలువురు పేర్లు రాసుకుని వారి వేలిముద్రలను వేరే వారితో వేయించి.. గ్రామమంతా సహకరించినట్లు అందులో రాయించాడు.

ఖమ్మం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ఈ స్థలాల రేట్లు కోట్లలో పలుకుతున్నాయని.. దీంతో సదరు నేత కన్ను ఈ చెరువు, శ్మశాన వాటిక స్థలంపై పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాత ముత్తాల కాలంనాటి శ్మశానవాటిక, చెరువును సంరక్షించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.