ETV Bharat / state

GUNNY BAGS: రైతులను వేధిస్తున్న గోనె సంచుల కొరత.. పట్టించుకోని అధికారులు - Eluru district villages news

Farmers fire on ap government: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన గోనె సంచులను ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి 110 సంచులు అవసరం కాగా, ప్రభుత్వం 91 సంచులను మాత్రమే రైతులకు పంపిణీ చేసిందని ఆవేదన చెందుతున్నారు. పంపిణీ చేసిన ఆ 91 గోనె సంచుల్లో కూడా చాలా వరకు చిరిగిపోయిన సంచులే ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers fire
Farmers fire
author img

By

Published : Apr 21, 2023, 1:28 PM IST

Farmers fire on ap government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే గోనె సంచుల విషయంలో నాణ్యమైన సంచులను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి 110 గోనె సంచులు అవసరం కాగా, ప్రభుత్వం మాత్రం 91 సంచులనే పంపిణీ చేసిందని.. పంపిణీ చేసిన ఆ 91 గోనె సంచుల్లో దాదాపు 40 శాతానికిపైగా చినిగిపోయి ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. ఎకరానికి 110 గోనె సంచులను పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ఎకరానికి 110 సంచులు ఇవ్వాలి.. ఖరీఫ్ మాదిరే రబీలో కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో తలెత్తుతున్న సమస్యల కారణంగా అన్నదాతలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎకరానికి 110 గోనె సంచులు వరకు అవసరం కాగా, రాష్ట్రం ప్రభుత్వం 91 సంచులను మాత్రమే రైతులకు పంపిణీ చేస్తుంది. దీంతో ఖరీఫ్‌లో కన్నా రవి దిగుబడి ఎక్కువగా ఉంటుందని.. తక్కువ సంచులిస్తే ఎలా అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

91 సంచుల్లో చాలావరకు చిరిగిపోయాయి.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని రైతులను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ఎకరానికి ఇచ్చే 91 గోనె సంచుల్లో చాలా వరకు చిరిగిపోయి ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ 91 సంచుల్లో కూడా చాలా వరకు చిరిగిపోయి ఉండడంతో.. కొంత ధాన్యం కల్లాల్లోనే ఉండిపోతుందని అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మిగిలిపోయిన ధాన్యానికి సంచులు ఎప్పుడు ఇస్తారో.. పట్టుబడి ఎలా జరుగుతుందో.. అని అని రైతులు భయానికి గురవుతున్నారు.

సరిపడ గోనె సంచులు ఇవ్వాలి.. మరోపక్క గోవింద సంచల్లోకి పట్టిన ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి లారీలు రాకపోవడంతో బస్తాలు కల్లాల్లోనే ఉండిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు.. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. రైతుల బాధలను అర్థంచేసుకోని.. ఎకరానికి సరిపడ గోన సంచులు పంపిణీ చేయాలని, త్వరగా ఎగుమతికి వాహనాలను సమకూర్చాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.. ఈ సందర్భంగా నారాయణపురం రైతులు మాట్లాడుతూ..''నా పేరు శివలింగరాజు.. నేను కౌలు రైతుని. నలుగురం రైతులం కలిసి 15 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పటికే 9న్నర ఎకరాల్లో వరి కోతలు అయిపోయి, ధాన్నాన్ని పట్టాము. ప్రభుత్వం ఎకరానికి 91 సంచులు ఇచ్చారు. ఇచ్చిన ఆ 91 సంచుల్లో 30 సంచులు పాడైపోయాయి. అంతేకాకుండా, నాలుగు నుంచి ఐదు సంచులు తక్కువగా వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తే.. మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి..మా దగ్గర సంచులు లేవంటూ భయపెడుతున్నారు. వాతవరణం చూస్తే వర్షాలు పడేలా ఉన్నాయి. వర్షం పడితే కల్లాల్లో ఉన్న ధాన్యమంతా పాడైపోతుంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థంచేసుకోని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.'' అని అన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.